19-07-2025 12:46:26 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని, సీ ఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమ ర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారా.. లేక ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసు కునే పనిలో ఉన్నారా అర్థం కావడం లేదన్నారు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. లోపాయికారీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే రేవంత్ ఇంటినుంచి పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్ నుంచి పాలన చేయడం లేదని, హిడెన్ అజెండాతో కమాండ్ కంట్రోల్ నుం చి పాలన చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో సాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నప్పటికీ రాష్ర్టంలో అనేకచోట్ల ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ అవుతుందని విమర్శించారు. ఢిల్లీకి వెళ్తే రేవం త్‌రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అప్పుపుట్టడం లేదు, దొంగను చూసినట్లు చూస్తున్నా రని రేవంత్‌రెడ్డి అనడం ద్వారా తెలంగాణ ప్రతిష్టను రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు.
బీసీలకు బడ్జెట్‌లో సంవత్సరానికి 20 వేల కోట్లు చొప్పున లక్షకోట్లు పెడతామని, కేవలం 7 వేల కోట్లు మాత్రమే కేటాయించారని వెల్లడించారు. పోలీస్ స్టేష న్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయని, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు లు పెడుతున్నారని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ పాల్గొన్నారు.