21-07-2025 06:44:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(District Convener Syed Haider) అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 21వ తేదీలోగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చే అధికారం వచ్చిన తర్వాత ఏ సమస్య కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించడం చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో సంక్షేమ వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్ అయింది అని అన్నారు ఒకసారి కూడా మాట్లాడడం చేతకాదు అని అన్నారు. పెన్షన్లు పెంచుతామని అన్నారు కానీ ఎక్కడ కూడా పెంచలేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కరించకుండా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని అన్నారు. ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందింది అని అన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూలై 22వ తేదీన జూబ్లీ హిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కార్యకర్తలు ముట్టడిస్తారని ఆయన హెచ్చరించారు.