21-07-2025 06:32:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రతినెల 18,500 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్(CITU District General Secretary Suresh) డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో ఆరోగ్య సేవలు చేయించుకుంటున్నప్పటికీ వారి పనికితగ్గ పారితోషకం ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసుకోవాలని వేతనాలు పెంచాలని వేతనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సుజాత చంద్రకళ ఇంద్రమాల తదితరులు ఉన్నారు