calender_icon.png 21 July, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాపూర్‌నగర్‌ మార్కెట్ ఏర్పాటులో గుమ్మడి ఆంజనేయులు కృషి మరువలేనిది

21-07-2025 06:38:37 PM

ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129-సూరారం డివిజన్ టిఎస్ఐఎసి కాలనీలో నిర్వహించిన గుమ్మడి ఆంజనేయులు దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్(MLA KP Vivekanand) హాజరై గుమ్మడి ఆంజనేయులు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాపూర్‌నగర్‌ మార్కెట్ ఏర్పాటులో గుమ్మడి ఆంజనేయులు కృషిని గుర్తు చేసుకున్నారు.

అతిపెద్ద పారిశ్రామికవాడైన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నాడు కార్మికుల ఆకలిని తీర్చిన వ్యక్తి గుమ్మడి ఆంజనేయులు అని, షాపూర్‌నగర్‌ మార్కెట్ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి, సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బట్ట కృష్ణ, బొడ్డు వెంకటేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, డివిజన్ జనరల్ సెక్రటరీ సిద్ధిక్, నాయకులు చెక్క సురేష్, బర్ల శీను, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.