calender_icon.png 17 January, 2026 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు

17-01-2026 12:30:07 AM

కాళేశ్వరం జనవరి, 16 (విజయక్రాంతి): కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం, హుండీలను ఈవో ఎస్. మహే ష్ ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పర్యవేక్షించారు. గత మూడు నెలల కాలానికి గాను దేవస్థానానికి 34, 42,598 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు, సిబ్బంది, అలాగే కరీంనగర్ కు చెందిన శ్రీ వల్లి సేవ ట్రస్ట్, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి, హైదరాబాద్ కు చెందిన నరసింహ సేవా సమితి, శ్రీ రాజరాజేశ్వర సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.