17-01-2026 12:28:23 AM
---పోలీసుల పకడ్బందీ ప్రణాళికతో ప్రశాంతంగా దర్శనం
ములుగు, జనవరి16(విజయక్రాంతి): సంక్రాంతి సెలవుల సందర్భంగా అంచనాలకు మించి భారీ సంఖ్యలో భక్తులు మేడా రం వనదేవతలను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగు ఎస్ పి కేకన్ సుధీర్ రామనాధ్ ఐపీఎస్ ముందస్తు ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.భక్తుల రద్దీ నియంత్రణ కోసం యాక్సెస్ కంట్రోల్, క్యూలైన్ నిర్వహణ వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంతో భక్తులు ప్ర శాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకున్నారు. మే డారానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫి క్ నిర్వహణ కోసం 300 మందికిపైగా పోలీ సు సిబ్బందిని మోహరించారు.సరైన డైవర్ష న్ ప్లాన్ అమలు చేయడంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సజావుగా ట్రాఫిక్ కొ నసాగింది.ఈ బందోబస్త్లో మొత్తం 600 మందికిపైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.