calender_icon.png 17 January, 2026 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీరు.. ఖర్చుపై ఫోకస్?

17-01-2026 03:07:01 AM

  1. వ్యవసాయ నీటి వినియోగంపై కేంద్రం నిఘా? 
  2. త్వరలో మైనర్ ఇరిగేషన్ సెన్సెస్‌కు శ్రీకారం
  3. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన 
  4. ఈ సెన్సెస్‌పై శిక్షణ ఇవ్వాలని ఏఈఓలకు మౌఖిక ఆదేశం
  5. రాష్ర్టంలో చెరువులు, బోర్‌వెల్స్‌కు జియోట్యాగ్
  6. బోరుబావులు, చెరువులకు మీటర్లు పెడతారా..?
  7. రాష్ట్ర ప్రజల్లో హాట్ టాఫిక్‌గా చర్చ

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : వ్యవసాయానికి సంబంధించి నీటి వాడకంపై లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభు త్వం భావిస్తోంది. సాగు వివరాలు సమగ్రం గా తెలుసుకునేందుకు త్వరలోనే కేంద్రం దేశ వ్యాప్తంగా సెన్సెస్ ప్రారంభించనున్నట్లు స మాచారం. తెలంగాణలో కూడా మొత్తం నీటి వనరులు ఎన్ని..? అందులో చెరువుల పరిధిలో, బోరుబావుల పరిధిలో నీటి లభ్య త ఎంత? అనే వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర సర్కార్ లెక్కలు తీసేందుకు ‘మై నర్ ఇరిగేషన్ సెన్సెస్’ ప్రారంభించబోతుందని తెలుస్తోంది. తద్వారా చెరువులన్నింటినీ జియో ట్యాగ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు కేంద్రం సూచించినట్లు సమాచారం.

దీంతో రాష్ర్టంలోని చెరువులు ఎన్ని..? వాటి లో నీటి లభ్యత తదితర వివరాలన్నీ కేంద్రం వద్ద ఉండనున్నాయి. నీటి లభ్యత వివరాలు ప్రారంభమైతే రాష్ర్ట ప్రజలకు నీటిపై ఆంక్ష లు మొదలవుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సుమారు 70 శాతం పైగా ప్రజలు వ్యవసాయ రంగంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రా ష్ర్టంలో సుమారుగా 46,531 చిన్న నీటిపారుదల వనరులు ఉన్నాయి. వీటిలో గ్రామ పంచాయతీలు, ఫిషరీష్ సహకార సొసైటీ లు, హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి.

ఈ  చెరువుల కింద ఎంత వరిసాగు అవుతుందనే వివరాలను నమోదు చేయాలని ఇప్పటి కే వ్యవసాయ అధికారులకు సమాచారం వచ్చినట్లుగా తెలిసింది. కాగా, రాష్ర్టంలో ప్రతి ఏటా 80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు అధికారులు అంచనా. అందులో ఎక్కువగా చెరువులు, బోరు బావుల కిందనే సుమారు 50 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. దీంతో పంట దిగుబడి ఎంత వస్తుం దనేది కూడా అంచనా వేయవచ్చు. అంటే రాష్ర్టంపై కేంద్రం నిఘా పెట్టబోతున్నట్లు స్పష్టం అవుతుంది.

త్వరలోనే అధికారులకు శిక్షణ

త్వరలోనే రాష్ర్టంలోని వ్యవసాయ అధికారులకు మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ ఎలా చేపట్టాలి..? చెరువుల వివరాలను జియో ట్యాగ్ ఎలా చేయాలి? దాంతోపాటు చెరువు కింద సాగు  పంటల వివరాలు.. దిగుబడి.. రైతుల సంఖ్య.. ఎన్ని పంటలు సాగవుతున్నాయనే వివరాలను ఎలా నమోదు చేయాలి అనే దానిపై వ్యవసాయ శాఖ అధికారులకు  క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీనికి తోడు బోరు బావుల వివరాల ను సైతం సేకరించి కేంద్రం చెప్పే సెన్సెస్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. రాష్ర్టం లో సుమారు 30 లక్షలకు పైగా వ్యవసాయ(పంపుసెట్లు) కనెక్షన్ ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే ఈ వివరాలను కూడా నమోదు చేయబోతున్నట్లు సమాచారం.

మీటర్లు పెట్టేందుకేనా..?

వ్యవసాయ బోరుబావుల వద్ద ఎంత విద్యుత్ వినియోగం అవుతుందనే వివరాలను తెలుసుకునేందుకే మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ నిర్వహిస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం  మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినా.. తాము మాత్రం ఒప్పుకోలేదని అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మోటార్లకు మీటర్లకు పెట్టకపోడంతో.. ప్రతి ఏటా రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల  కోట్లను సైతం వదులుకున్నామని అప్పట్లో కేసీఆర్ తెలిపారు. అయితే ఇప్పుడు కేంద్రం మైనర్ ఇరిగేషన్ సెన్సెస్‌ను ప్రారంభించ బోతుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే చర్చ నడుస్తోంది.

రాష్ర్ట వ్యాప్తంగా ఐదు లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా అందులో మూడు లక్షలకు పైగా వ్యవసాయానికి ఉపయోగపడేవి అయితే వీటన్నిటికీ మీటర్లు పెట్టి.. యూనిట్లను సైతం నిర్ణయించి ఉచిత సబ్సిడీకి మంగళం పాడుతార..? అనే అంశంపైన ఇప్పుడు చర్చకు దారితీసింది. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఈ తరుణంలో కేంద్రం మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ ప్రారంభిస్తుండటంతో తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.