17-01-2026 03:02:39 AM
75 కోట్లతో మాస్టర్ ప్లాన్
మంత్రులు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, జనవరి 16 (విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి ప్రత్యేకంగా 75 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారుచేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వీరభద్ర స్వామిని మంత్రులు దర్శించుకొని స్వామివారికి ప్రత్యేకంగా గుమ్మడికాయలు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ వీరభ ద్రుని దర్శించేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పది లక్షల పైగా భక్తులు జాతర సమ యంలో వస్తారన్నారు.
ఆలయ ప్రాకారాలు, మాడవీధుల నిర్మాణాలకు 75 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు.గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ ఉత్సవాల సందర్భంగా ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ ఈవో కిషన్‌రావు వెల్లడించారు సంక్రాం తి పర్వదినం పురస్కరించుకొని వీరభద్రుని సన్నిధిలో ఏకాదశ రుద్రాభిషేకం, రసాభిషేకం, క్షీరాభిషేకం పూజలను నిర్విఘ్నంగా కొనసాగించినట్లు ఆలయ అర్చకులు కంచనపల్లి రాజయ్య, మొగిలిపాలెం రాం బాబు, శివకుమార్. వినయ్‌శర్మ, తాటికొండ వీరభద్రయ్య, జానకి పురం రవిశర్మ, గుడ్ల శ్రీకాంత్, రమేష్, గురు ప్రసాద్, బిట్టు లు వెల్లడించారు.
మకర సంక్రాంతి రోజున కొత్తపెళ్లి గ్రామస్తులు తమ 72 ఎడ్లబండ్లను పూల మాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు జాతరకే హైలెట్‌గా నిలిచింది. శుక్రవారం వేలేరు గ్రామస్తులు తమ మేకపోతులను అందంగా తీర్చిదిద్ది ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. మాజీ ప్రధాని వంగర లోని పీవీ ఇంటి నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన రథాన్ని వారి కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ శరత్‌రావు, పీవీ మదన్మోహన్, వంగర సర్పంచ్ గజ్జల సృజన రమేష్ లు ప్రారంభించారు.
ఉత్సవాల సందర్భంగా డీసీపీ కవిత, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సీఐ పులి రమేష్ , ఎస్‌ఐలు రాజు, దివ్య, ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు భక్తులకు సేవలు అందించారు. ముల్కనూర్ ఆస్పత్రి నుంచి డాక్టర్లు జోస్న, రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్, గోదావరిఖని, హైదరాబాద్, హుజూరాబాద్, జనగాం నుంచి జాతరకు ప్రత్యేకంగా బస్సులు నడిపించారు. జాతరలో ఆలయ డైరెక్టర్లు జాతరలో భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.