10-12-2025 02:13:27 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): సిజేరియన్ కంటే సాధారణ ప్రసవాలే శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొమ్మిదో సీజన్‌కు మొత్తం 220 జంట లు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించా రు. భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభిన య్ అన్నారు.
కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ, “సాధారణ ప్రసవాల ను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయని చెప్పారు.
తొమ్మిదో సీజన్‌లో మొత్తం 220 జంటలకు ఈసారి మేము కొత్త టాలెంట్ రౌండ్ చేసి మిసెస్ మామ్ గాట్ టాలెంట్‌ను ప్రారంభించాము. ఈ విభాగాల విజేతలను మిస్టర్ అండ్ మిసెస్ బెస్ట్ డాన్సర్, చెఫ్, కామెడీ, మిమిక్రీ, సింగర్, ఆర్టిస్ట్ మరియు వ్లాగర్. జంటలు ఏవైనా 2 ఎంపికైన విభాగాలలో పాల్గొన్నారు. మూడు నగరాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 9 జంటలను హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ వారికి నేరుగా గ్రాండ్ ఫినాలెలో ప్రవేశం కల్పించారు. వారితో కలిపి మొత్తం 57 జంటలు గ్రాండ్ ఫినాలె సందర్భంగా గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం తదితర అంశాలకు అవగాహన కల్పిస్తూ, ర్యాంప్ వాక్ చేశారు.
కిమ్స్ కడల్స్ మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ విజేతగా దిల్లీకి చెందిన పాయల్-అక్షయ్ రాథోడ్ నిలిచారు. మొదటి రన్నరప్‌గా నాగలత రెండో రన్నరప్‌గా నందిని దంపతులు నిలిచారు. విజేతకు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా డెలవరీ చేయనున్నారు. మొదటి, రెండవ విజేతలకు బహుమతులు అంజేశారు. ఇవి కాక ఇంకా.. ఈసారి సరికొత్తగా మిసెస్ మామ్ గాట్ టాలెంట్ అనే పోటీ కూడా పెట్టారు.