20-09-2025 07:44:48 PM
బెజ్జంకి: దుర్గామాత మండపాలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్థానిక ఎస్ఐ బోయిని సౌజన్య అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బెజ్జంకి మండల వ్యాప్తంగా మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/ind ex.htm లింకులో కమిటీల వివరాలను నమోదు చేసి ఒక కాపీ ప్రింట్ తీసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేయాలన్నారు.
దరఖాస్తు చేసుకొని వారికి అనుమతులు ఇవ్వబోమన్నారు. అప్లికేషన్లలో సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రార్థన మందిరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్పీకర్ బాక్స్ లను మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొన్నారు.