calender_icon.png 5 August, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేశవపట్నం పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సిపి గౌస్ అలాం

04-08-2025 11:21:36 PM

హుజురాబాద్ (విజయక్రాంతి):  కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం(Police Commissioner Gaush Alam) అద్దె భవనంలో మార్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో కమిషనర్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్  భవనం శిథిలావస్థలో ఉండటంతో అద్దె భవనంలోకి మార్చినట్లు తెలిపారు. ఈ మార్పుతో ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణంలో పోలీసు సేవలు అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్తులో శాశ్వత భవన నిర్మాణానికి ప్రణాళికలు చేపడుతున్నామని సిపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసిపి మాధవి, హుజరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్, హుజరాబాద్ పట్టణ సిఐ కరుణాకర్, కేశవపట్నం ఎస్సై కట్కూరి  శేఖర్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.