calender_icon.png 5 August, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ 30 వేల నగదు వితరణ

04-08-2025 11:23:01 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 6న బెల్లంపల్లి పట్టణానికి చెందిన పాత 21 వ వార్డు మాజీ కౌన్సిలర్ డాక్టర్ తోడే వంశీకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అమెరికాలో స్థిరపడ్డ అతని సోదరుడు తోడే వెంకట కృష్ణారెడ్డి బూడిద గడ్డ బస్తీలోని పలు ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ 30 వేలను పోలీసులకు వితరణ చేశారు. నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుల సహకారాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. తోడే వెంకట కృష్ణారెడ్డి వితరణ చేసిన నగదును సోమవారం 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పీక లక్ష్మణ్, పట్టణానికి చెందిన న్యాయవాది మాధరి రాకేష్ లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు, ఎస్సై రాకేష్ లకు అందజేశారు. డాక్టర్ తోడే వంశీకృష్ణ రెడ్డి జ్ఞాపకార్థం అతని సోదరుడు తోడే వెంకట కృష్ణారెడ్డి గతంలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు.