04-08-2025 11:18:16 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా(Karimnagar District) సైదాపూర్ మండలం చింతలపల్లి గ్రామం వద్ద సోమవారం ఎదురెదురుగా ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని మహమ్మద్ సల్మాన్, ఎండి ఫరీషాకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సల్మాన్ వాళ్ళ అమ్మను తీసుకొని ద్విచక్ర వాహనంపై అగురారంలోని వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి హుజురాబాద్ కి వస్తుండగా చింతలపల్లి గ్రామం వద్ద హుజురాబాద్ నుండి సైదాపూర్ కు వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టడంతో సల్మానికి తలకి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు 108 లో హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ పరిస్థితి విషమించడంతో ప్రధమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసంవరంగల్ లోని ఎంజిఎంకు తరలించారు.