calender_icon.png 25 October, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ రవాణా అధికారులకు సిపిఐ వినతి

25-10-2025 08:03:03 PM

ఉప్పల్,(విజయక్రాంతి): కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమని దానికి గల కారణం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యల నిర్లక్ష్య వైఖరి కాబట్టి వెంటనే అలాంటి ట్రావెల్స్ మన పరిధిలో ఉంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవల్ని నేడు సిపిఐ ఆధ్వర్యంలో ఉప్పల్ లో ని ఆర్ టి ఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి సిపిఐ ఆధ్వర్యంలో  వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి .సత్య ప్రసాద్, సిపిఐ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ లు మాట్లాడుతూ కర్నూల్ సంఘటన చాలా బాధాకరమని,ఆ ప్రమాదం సంఘటనతోనైనా అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ చేసే మోసలను గ్రహించి మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడి ట్రావెల్స్ యాజమాన్యలను పిలిపించి తగు సూచనలు చెయ్యాలని,ఎవ్వరు కూడా నకిలీ రిజిస్ట్రేషన్ లేకుండా నకిలీ లైసెన్స్ గల డ్రైవర్లను పెట్టకుండా,ఇతర రాష్ట్రాల పెర్మిషన్ తో ఇక్కడ నడపకుండా చెయ్యాలని , అదేవిధంగా తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని ట్రావెల్ బస్సులను సీజ్ చేయాలని వారు కోరారు.