25-10-2025 08:00:11 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శనివారం పట్టణంలోని ఆచన్ పల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు డివిజన్ పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ నెల 28న పట్టణంలో రక్త దాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రక్త దాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.