25-10-2025 08:07:15 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవల కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. 100 పడకల ఆసుపత్రి పనుల పురోగతి పరిశీలించటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరంతో గతంలో ఈ హాస్పిటల్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. నాణ్యత లోపాలను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. పేద వారికి మొరుగైన వైద్యం కోసం ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌగొని శ్రీనివాస్ గౌడ్, లింగాల వెంకన్న, మురారి శెట్టి కృష్ణమూర్తి, గాజుల సుకన్య, నకిరేకంటి నరేందర్, యాసారపు వెంకన్న, గాధగొని కొండయ్య తదితరులు ఉన్నారు.