25-10-2025 06:26:41 PM
డిసెంబర్ 26న ముగింపు ఉత్సవాలు పండువల జరుపుకుందాం
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
కొత్తగూడెం,(విజయక్రాంతి): గ్రామగ్రామాన సిపిఐ శతవసంత ఉత్సావాలు సంబరంగా జరుపోకోవాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక శేషగిరిభవన్'లో శనివారం జరిగిన లక్ష్మీదేవిపల్లి సిపిఐ మండల సమితి సభ్యుల సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
డిసెంబర్ 26 నాటికి పార్టీ శతవసంతాలు పూర్తి చేసుకొంటోందని, ఈ సందర్బంగా ప్రతి గ్రామంలో జెండావిష్కరణలు జరిపి పార్టీ పోరాట చరిత్రను ప్రజలకు వివరించాలన్నారు. ఖమ్మంలో 26న జాతీయ స్థాయి ముగింపు ఉత్సావాల బహిరంగ సభ జరగబోతోందని జిల్లా నుంచి లక్ష మందిని తరలించే దిశగా పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ సభకు 40దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు.