25-10-2025 06:29:58 PM
మాగనూరు: మండలంలో వరి ధాన్యం పండించే రైతులు దళారులను నమ్మి మోసపోదని మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఉజ్జల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రాధా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు ఏ గ్రేడ్ వరి రకం 2389 రూపాయలు, బి గ్రేడ్ రకం 2369 రూపాయల ప్రకారం కొనుగోలు చేయడం మరి జరుగుతుందన్నారు. ధాన్యాన్ని ఆరపెట్టుకొని తీసుకురావాలన్నారు. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. కావున రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.