calender_icon.png 16 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షపాతి సురవరం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

16-09-2025 06:55:56 PM

కోదాడ: ప్రజల పక్షపాతి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఐ జాతీయ నాయకులు కామ్రేడ్ సురవరం సంతాప సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు.ఉన్నత విలువలు గల వ్యక్తిగా సురవరం కీర్తించబడ్డాడని ఉత్తమ్ పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల కోసం సీపీఐ పార్టీ పోరాటం చేసిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ప్రజల పక్షాన పోరాటం చేసేది కమ్యూనిజమేనని వివరించారు. కోదాడ, హుజుర్నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.