16-09-2025 06:54:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక ఎస్టియు భవన్ నిర్మల్ లో ఏర్పాటుచేసిన నిర్మల్(పట్టణ) మండల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా డి. లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎం.డి. ఖాలిద్, ఆర్థిక కార్యదర్శి తాళ్ల లఖన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్.రాజన్న, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఇష్టాక్, పోశెట్టి, కృష్ణ కుమార్, జిల్లా కౌన్సిలర్లుగా జుట్టు గజేందర్, జె.లక్ష్మణ్, ఇర్ఫాన్ షేక్, బి. వెంకటేశ్వరరావు, ఇంతియాజ్, సంతోష్ కుమార్, ఏం. శ్రీనివాస్, రాందేవ్, ఎన్నికల పరిశీలకులుగా మా రెడ్డి శ్రీనివాస్ వ్యవహరించారు.