16-05-2025 03:05:35 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్రూం(Double bedrooms) ఇండ్లను అర్హులైన పేదలను లబ్ధిదారులుగా గుర్తించి వారికి మాత్రమే అందించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం మందమర్రి మండల తహసిల్దార్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.డబుల్ బెడ్రూం ఇండ్ల కొరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్లకు ఏ ప్రతిపాదికన వారికి ఇండ్లను ఈ ప్రభుత్వం కేటాయిస్తుందని బిఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్ ప్రశ్నించారు.
ఎన్నో ఏళ్లుగా గూడులేక పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇళ్లు ఉన్నవారి,గత ప్రభుత్వం నుండి ఇంటి పట్టాలు పొందిన వారికి ఇళ్లను కేటాయించడం సరైందికాదన్నారు.కాంగ్రెస్ నాయకులు వారి స్వలాభం కొరకు అర్హులు కాని వారికి పేర్లను చేర్చారని వారి పేర్లను జాబితాలో నుంచి వెంటనే తొలగించాలని అలాగే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు లో ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను,కొత్తగా అర్జీలను పరిశీలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,గడ్డం రాజు,రామీడి లక్ష్మి కాంత్,చంద్ర కిరణ్,చంద్రమౌళి,వేముల వెంకటేష్ , సతీష్,రవీందర్,మనీ పాల్గొన్నారు.