calender_icon.png 17 May, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు

16-05-2025 10:18:35 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో సిడిపిఓ, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్ల నుంచి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని టేకులపల్లి అంగన్వాడి టీచర్ కల్తీ భద్రమ్మ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఐసిడిఎస్ పరిధిలో రూ.7.98 లక్షల  అవుతవుకలకు పాడిన పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. పలువురు వద్ద నుండి రూ 2వేలు ఇవ్వాలని సూపర్వైజర్ బెదిరింపులకు గురిచేసారని ఫిర్యాదులో వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలో  228 మంది అంగన్వాడీ టీచర్ల నుండి  రూ. 2వేల చొప్పున మొత్తం 4.56 లక్షలు  సూపర్వైజర్ల ద్వారా వసూళ్లకు పాల్పడినట్టు కలెక్టర్ కు తెలిపారు. దీనిపై సిడిపిఓ మంగతాయారుని, సూపర్వైజర్ అనురాధాను ఫోన్లో వివరణ కోరగా అలాంటిదేమీ లేదని కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.