calender_icon.png 11 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటుతాం

10-10-2025 12:11:08 AM

ఇల్లందు టౌన్, అక్టోబర్ 9, (విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ సత్తా చాటుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే సారయ్య అన్నారు. గురువారం ఇల్లందు మండల సిపిఐ విస్తృతస్థాయి సమావేశం పట్టణంలోని విట్టల్ రావు భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా కే సారయ్య మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికల ఓడంబడిక ఆధారంగానే 16 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పిటిసి స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు .

స్థానిక సమస్యలపై పోరాటం చేసి, ప్రజల్లో అభిమానం చూరగొన్న కార్యకర్తలకే పార్టీ బీఫామ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క కార్యకర్త సిపిఐ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, సిపిఐ నాయకులు బసిపాక రవి,మోజెస్, గుగులోత్ కృష్ణ, ఉడుత ఐలయ్య, వడ్ల శీను, మంచాల వెంకటేశ్వర్లు, రాము, అలెం రాఘవేందర్రావు, తాండ్ర లక్ష్మీనారాయణ, బొల్లి కొమరయ్య, సదానందం, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.