calender_icon.png 11 October, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సేవా పక్వాడా

10-10-2025 12:11:32 AM

  1. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహణ
  2. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గురువారం హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ‘సేవా పక్వాడా’ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమాజానికి సేవలందించిన విశిష్ట వ్యక్తులు, పద్మ అవా ర్డు గ్రహీతలను సన్మానించారు. వారు సాధించిన విజయాలు, అందించిన సేవలను గౌరవిస్తూ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.

డాక్టర్లు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులను సత్కరించి, తద్వారా రాబోయే తరాలకు ప్రేరణ అందించడమే ఉద్దేశం. ప్రధానంగా యువతలో స్ఫూర్తి నింపడం, నశా ముక్త్ భారత్ (డ్రగ్స్ ఫ్రీ నేషన్)గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్లాలని రాంచందర్‌రావు అన్నారు. విద్యార్థులు, యువత క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్రగ్స్ నుంచి విముక్తి పొందేలా స్ఫూర్తినింపాలి అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి మంచి స్పందన వచ్చింది.