18 April, 2026 | 12:51 AM

స్వాతంత్రోద్యమంలో సీపీఐది కీలక పాత్ర

12-05-2025 12:30 AM

పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ 

చేర్యాల, మే 11: స్వాతంత్రోద్యమం తో పాటు, తెలంగాణ సాయుధ పోరాటాలలో సి ఫై సిపిఐ  కీలకపాత్ర పోషించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి 100 పవన్ అన్నారు. సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న మహాసభల్లో భాగంగా ఆకునూరు గ్రామంలో ఆదివారం భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో స్వాతంత్రోద్యమ కాలంలో  దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని కొట్లాడింది సిపిఐ పార్టేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తమ పార్టీ  ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.సిపిఐ కార్మిక, కర్షకుల పక్షపాతి పార్టీ అన్నారు. దున్నే వాడికి భూమి దక్కాలని పోరాటం చేసిందని, పోరాటంలో 4500 మంది ప్రాణ త్యాగం చేశారని, ఫలితంగా పేదలకు పదిలక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టుతూ, మత కల్లోలను సృష్టిస్తుందని ఆరోపించారు.

మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఈ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ అంతా కమ్యూనిస్టు పార్టీలదే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి , ఈరి భూమయ్య, నంగి కనకయ్య, నంగి సత్తయ్య, ఉడుత సత్యనారాయణ, బూర్గుల వీరయ్య, పోషబోయిన పరమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.