17 April, 2026 | 11:21 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అందుబాటులోకి మామిడి పండు రారాజు

12-05-2025 12:32 AM
  1. కిలో మామిడి పండ్లు రూ.2.50 లక్షలు 
  2. రుచికి రుచి...పోషకాలకు పోషకాలు 

కల్లూరు, మే 11 (విజయ క్రాంతి) మామిడి పండ్లలోనే రారాజుగా పేరొందిన మియాజాకి ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రుచి కి రుచి... పోషకాలకు పోషకాలు కలిగిన ఈ రకం మామిడిపండు ధర వెంటే షాక్ కావాల్సిందే. కిలో మామిడిపండు ధర అక్షరాల రూ 2.50 లక్షలు మాత్రమే. మామిడిపండు ధర అంత ఉంటుందా అనే అనుమానం అందరిలో తలెత్తక మానదు. ఏ రకం మామిడిపండు జపాన్ దేశంలో మియాజాకి నగ రంలో అత్యధికంగా పండిస్తారు. అందుకే ఆ రకం మామిడిపండుకు ఆ పేరు వచ్చింది.

ఈ రకం మామిడి పండును ఎగ్ ఆఫ్ సన్ షైన్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, బేటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ప్రపంచంలోనే  అత్యధిక ఖరీదైన మామిడి పండుగా పేరొందింది. క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉండడంతో పాటు, జింక్, క్యాల్షియం, విటమిన్లు సి,ఈ, ఏ ,కే వంటీ పోషకాలు మియాజాకి మామిడి పండ్లు లభిస్తాయి.

శరీరానికి అవసరమైన కాపర్ మెగ్నీ షియం అంటే మూలకాలు ఈ పండులో ఉన్నాయి. మలబద్ధకం,అజీర్ణం ఇతర కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మీ ఆజాకే మామిడి పండు తీసుకొండే సమస్యలు తగ్గుతాయి. వేసవికాలంలో మామిడి పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఈ పండులో లభించే విటమిన్లు మినరల్స్ కారణంగా చర్మానికి మేలు చేస్తాయి.

ఈ మామిడి పండు తింటే మూసుకుపోయిన చర్మం రంధ్రాలు తెరుచుకొని ముఖం కాంతివంతం అవుతుంది. ఆర్థిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే తీవ్రతను తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు కలిగిన మియాజాకి కి అంత డిమాండ్. 

మియాజాకి రకానికి

అనువైన నేలలు 

జపాన్ దేశానికి చెందిన మియా జాకి రకానికి మన నేలలు అనువైనవి. 2020 లో కరోనా సమయంలో బెంగళూరు నుంచి ఈ రకం మొక్కలు రూ 10వేల చొప్పున ఒక మొక్కను కొనుగోలు చేసి కల్లూరు రూరల్ మండలంలోని  తన వ్యవసాయ క్షేత్రంలో 10 మొక్కలు నాటడం జరిగింది. గత ఏడాది ఒక్కొక్క చెట్టు 30 పండ్లను కాసిందని, ఈ ఏడాది 80 కాయల వరకు కాసాయన్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో కడియం నుంచి మరో 58 మొక్కలు, ఒక్కొక్క మొక్క రూ 1100 చొప్పున తెచ్చి నాటడం జరిగిందన్నారు. ఈ రకం మామిడి పండ్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు పండిస్తే మార్కెటింగ్ సులభంగా ఉంటుందని ఉద్యాన అధికారులు సూచన మేరకు సాగు చేస్తున్న అన్నారు. మార్కెట్లో ఈ రకం మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉందన్నారు.

గరికపాటి వెంకట్రావు (రైతు)