18 April, 2026 | 2:24 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

12-05-2025 12:30 AM

బూర్గంపాడు,మే11(విజయక్రాంతి):  బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నిరుపేదకు అందిస్తామన్నారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు.

బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బోరెం వెంకటేశ్వర్లు,విజయ దంపతుల కుమారుడు బోరం సంపత్ కుమార్,సారిక నవ వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, బూర్గంపాడుమండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,మాజీ ఉపసర్పంచ్ లు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,మండల నాయకులు కైపు శ్రీనివాస్ రెడ్డి,చల్లా వెంకట నారాయణ,భజన ప్రసాద్,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.