calender_icon.png 16 August, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు

16-08-2025 08:15:18 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం పార్టీ(CPM Party) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సిపిఎం బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక-ఇరవెండి ఆర్ అండ్ బీ రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలియజేశారు. రోడ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. రోడ్లు సరిగా లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలన్నారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, అబిదా, కౌవులూరి నాగమణి, సరూప, ఐశ్వర్య, బోళ్ళ ధర్మ, నరసింహారావు, జంపన్న తదితరులు పాల్గొన్నారు.