calender_icon.png 16 August, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి..

16-08-2025 08:06:20 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజాంసాగర్ సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్(Sub Inspector Shivakumar) పేర్కొన్నారు. ఆయన శనివారం నాడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఫంక్షన్ హాల్ లో గణేష్ మండలి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటులేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాల నిర్వహించాలని ఆయన సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటు విద్యుత్ దీపాల అలంకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.