calender_icon.png 16 August, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రవెల్లిలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

16-08-2025 08:17:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో గల శ్రీ సోమేశ్వర అన్నపూర్ణ సహిత దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కుమ్మెర మహాదేవ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. గ్రామంలోని చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఎంతగానో అలరించారు. ప్రత్యేక నృత్యాలతో కన్నుల విందు చేశారు. అనంతరం దేవాలయం ఎదుట చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో సందడి చేశారు.