calender_icon.png 6 August, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటాపురం చర్ల రహదారి మరమ్మతుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం

06-08-2025 06:59:32 PM

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): వెంకటాపురం-చర్ల రహదారి పరిస్థితి తక్షణమే మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ(CPM Party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ బుధవారం విజయవంతంగా ముగిసింది. రహదారి యొక్క దురవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానికులు పెద్ద సంఖ్యలో సమ్మెకు మద్దతుగా పాల్గొన్నారు. రహదారి మరమ్మత్తులు చేపట్టే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. వారు అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్ సందర్భంగా మండల కేంద్రంలోని కొత్తగా వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రైవేటు వాహన ఆటో యూనియన్లు సైతం బందుకు సహకరించడంతో బంద్ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది.