06-08-2025 07:20:34 PM
రామకృష్ణాపూర్: తెలం‘గానం’ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను పట్టణ బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణంలోని స్థానిక విఠల్ నగర్ చౌరస్తాలో గల జయశంకర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి డా.రాజరమేష్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ తనదైన శైలి ముద్ర వేసుకున్నారని, మలి దశ తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ కు మార్గదర్శిగా, సలహాదారుడిగా ఉండటమే కాక ఉద్యమం కొరకు తన జీవితాన్ని సైతం అంకితం చేశారని కొనియాడారు. ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ లాంటి పదవులను ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు రజియా, రామిడి కుమార్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, జీలకర మహేష్, గడ్డం రాజు, జక్కన బోయిన కుమార్, మూర్తి, అర్నె సతీష్, పైతార్ ఓదేలు, మీనయ్య, కొండ కుమార్, పిల్లి సతీష్, కలువల సతీష్, రామిడి లక్ష్మీ కాంత్,చంద్ర కిరణ్, గోనె రాజేందర్, మని, కురుమ దినేష్, రాజేందర్, శ్రీకాంత్, పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.