calender_icon.png 6 August, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి

06-08-2025 08:35:29 PM

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

హన్మకొండ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు

హన్మకొండ (విజయక్రాంతి): బిజెపి మనువాద విధానాల్లో భాగంగానే బీసీ రిజర్వేషన్ల చట్టంకు కేంద్రం మోకలడ్డుతున్నదని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్(District Secretary Peddarapu Ramesh) అన్నారు. బీసీలపై ఏమాత్రం ప్రేమ ఉన్న తక్షణమే తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తక్షణమే పార్లమెంటులో ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరినీ నిరసిస్తూ వరంగల్ చౌరస్తాలో ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలైన బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తూ దోచుకుంటున్నారని అందుకు బిజెపి పాలకులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నదని మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఈ క్రమంలో జనాభాలో ఐదు ఆరు శాతం లేని అగ్రవర్ణ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి 50% పైగా ఉన్న బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకురావడానికి అనేక అడ్డంకులు కల్పిస్తూ బీసీలకు తీరని అన్యాయాన్ని చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా చాలా వెనుకబడిపోతున్నారని రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం పొందలేకపోతున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కలిగి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానించిన కేంద్ర ప్రభుత్వం  ఆమోదించకుండా రాజకీయ లబ్ధి కోసం దొంగ దొంగ అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని ఆరోపించారు.

బీసీలకు అన్ని రంగాల్లో జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటిస్తే అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి కుంటి సాకులు చెప్పకుండా తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టం అమలయ్యే విధంగా తక్షణమే పార్లమెంట్లో ఆమోదించాలని లేకపోతే బీసీలంతా రాజకీయాలకు అతీతంగా బిజెపి మోడీ పాలనకు తగిన విధమైన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, మాలోతు ప్రత్యూష,ఎగ్గని మల్లికార్జున్, బిఎల్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ ఐతం నాగేష్, పార్టీ నగర నాయకులు పరిమళ, గోవర్ధన్, రాజు, ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, గణిపాక ఓదేలు, హైమద్, రాయినేని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.