calender_icon.png 6 August, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలు సత్తా చాటాలి

06-08-2025 06:56:55 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు మల్లేశం(Kuruma Sangam President Oggu Mallesham) కురుమ అధ్యక్షతన చొప్పదండి నియోజకవర్గం కురుమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం కోట్ల నర్సింహులపల్లె వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కురుమలు ప్రతి పార్టీలో, ప్రతి చోట వార్డ్ మెంబర్, సర్పంచ్, యంపిటిసి, జడ్పిటిసి, యంపిపి వరకు అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో పోటీకి సిద్ధం కావాలన్నారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కురుమలు అన్ని రంగాలలో అన్ని వర్గాలకు దీటుగా ముందుకు వెళ్తున్నామని, మన కులవృత్తి అయిన గొర్రెల పెంపకం రోజురోజుకు క్షీణిస్తున్నందున నేటి కురుమ యువత అన్ని రంగాలలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న ప్రతి సభ్యునికి ఇతర వృత్తుల వారికి ఇస్తున్న విధముగా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఉన్న గొంగడి నేత వృత్తి బ్లాంకెట్ల దాటికి తట్టుకోలేక కనుమరుగైపోవడం వృత్తి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో చెలుకలు, బీడు భూములు లేక మేయడానికి అనుకూలమైన ప్రాంతాలు లేకపోవడం వలన గొర్రెల పెంపకం వృత్తి అంతరించిపోయే ప్రమాదంలో పడ్డదన్నారు. ప్రభుత్వాలే ఈ వృత్తిని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు.

గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే లక్ష రూపాయలుగా ఉన్నా ఎక్స్ గ్రేషియా 10 లక్షలు పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. మనం ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సిన మన వాటాను యువత ఐక్యంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నదన్నారు.ఈ సమావేశములో సిరిసిల్ల రాజన్న జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు, చెస్ డైరెక్టర్ ఎనుగుల కనకయ్య,  కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, గంగాధర మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎలుక పెళ్లి లచ్చయ్య, కొరటపల్లి మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్, కురుమ పంచాయతీ కమిటీ జిల్లా అధ్యక్షులు, రామడుగు మండల ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు కోరె గట్టయ్య, బోయినిపెల్లి మాజీ సర్పంచ్ సంబు లక్ష్మిరాజుం, పల్ల మల్లిక్,  గంగాధర మండల కురుమ సంఘం అధ్యక్షులు, ర్యాలపెల్లి మాజీ యంపిటిసి దానె ఓదెలు,  కురుమ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప , ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం రామడుగు మండల అధ్యక్షులు సాయిల్ల రాగుల మల్లయ్య , కడారి రాజేష్,  ఎనుగుల రాజు, కడారి మల్లేశం, సాయిల్ల శంకర్, బీరయ్య, కొమురయ్య, కనుకయ్య తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.