calender_icon.png 1 September, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లును గవర్నర్ ఆమోదించాలి

01-09-2025 02:54:40 PM

అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పట్ల సర్వత్ర హర్షం

స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల అమలు కై కాంగ్రెస్ చేస్తున్న కృషికి హాట్సాఫ్

పార్టీల చిత్తశుద్ధిని బీసీలు గమనిస్తున్నారు

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం తడక కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే కసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం పట్ల ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి హాట్సాఫ్ చెబుతున్నట్లు పర్ష హన్మాండ్లు అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయమై కొన్ని పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని ఈ వ్యవహారం అంతా బీసీ సమాజం గమనిస్తుందని పర్ష హన్మాండ్లు అన్నారు. 

నిన్న అసెంబ్లీలో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు, 42 శాతం రిజర్వేషన్లు అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,  ,సీతక్క  కొండా సురేఖ లకు మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పర్ష హన్మాండ్లు తెలిపారు, బీసీ బిల్లు గవర్నర్ ఆమోదిస్తారని బిసి సమాజం ఆశిస్తున్నదని అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు,ఈ రిజర్వేషన్ల అంశం బీసీలకు  నోటికి బుక్కలాగా దగ్గరగా వచ్చిందని దీన్ని ఎత్తగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదన్నారు, ఆరు నూరైనా ఏది ఏమైనా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు విద్యా,  ఉద్యోగ, రాజకీయ రంగంలో సాధించి తీరుతామని పర్ష హన్మాండ్లు అన్నారు ,గతంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేయకపోవడం వలన బీసీలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాలకు రాజ్యాధికారము దక్కిందని ప్రస్తుతం రాజ్యాధికారం వాటా దక్కాల్సింది బీసీలకేనని బీసీల జనాభా  56% ఉన్నదని ఆ జనాభా ప్రకారము బీసీల వాట బీసీలకే దక్కాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు, 42 శాతం రిజర్వేషన్లు అంశాన్ని మేము రాజకీయం చేయదలచుకోలేదని వేచి చూసే ధోరణిలో ఉన్నామని ఇంకా నాన్చివేస్తే ఇంకా ఏదైనా రాజకీయ పార్టీలు అడ్డగిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ విద్యార్థులు, బీసీ ఉద్యోగులు, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు, అందరితోని జేఏసీగా ఏర్పడి  రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా బీసీ ఉద్యమ ఉద్యమం మార్చుతామని దేనికైనా తెగిస్తామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కంచర్ల రాజు సీనియర్ నాయకులు చొక్కి కైలాసం, కొడం రవీందర్, సామల తిరుపతి ,దండు శ్రీనివాస్ ,ఇల్లంతకుంట తిరుపతి, బూర ఆంజనేయులు తర్వాత పాల్గొన్నారు.