calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మున్సిపల్ చైర్మన్ పరామర్శించిన మాజీ మంత్రి

28-09-2025 07:22:09 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఇటీవల గుండె సంబంధిత ఇబ్బందితో యశోద హాస్పిటల్ లో చికిత్స పొంది నల్లగొండ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డిని ఆదివారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకొని ప్రజా సేవలో యధావిధిగా పనిచేయాలని ఆకాంక్షించారు. వీరి వెంట నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది శ్రీనివాస్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి మాజీ కౌన్సిలర్ మరగొని గణేష్, బొజ్జ వెంకన్న, ఊట్కూరు సందీప్ రెడ్డి, కారింగు జానయ్య, దొడ్డి రమేష్, గాదె వివేక్ రెడ్డి తదితరులు ఉన్నారు.