28-09-2025 06:59:49 PM
దర్శించుకుని పూజలు చేసిన శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి..
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారు భక్తులకు శాంభవి అలంకారంలో ఆదివారం దర్శనమిచ్చింది. నాచారం శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు, ప్రధాన అర్చకులు చాడ నంద బాల శర్మ వేద పండితులు పూర్ణకుంభంతో స్వామివారికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహంకాళి అమ్మవారి మూలమూర్తికి, మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.