calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకమాన్య సహకార సంఘం చైర్మన్ గా భూసారపు గంగాధర్

28-09-2025 07:05:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): లోకమాన్య పరస్పర సహాయక పరపతి, సహకార సంఘం చైర్మన్ గా మూడోసారి భూసారపు గంగాధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కొత్త పాలకవర్గాన్ని ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు ప్రకటించారు. చైర్మన్ గా భూసారపు గంగాధర్, వైస్ చైర్మన్ గా శివరాం వెంకటేష్, జనరల్ సెక్రటరీగా మాజన్ సతీష్, క్యాషియర్ గా అన్నం వసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఇర్రి నరేందర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా జటాల శ్రీనివాస్ డైరెక్టర్లుగా అనురాధ పంపట్ వార్, ఓటారికారి విద్యాసాగర్, కుంచంవార్ మోరేశ్వర్ లు ఎన్నికయ్యారు. పెద్దల కమిటీ సభ్యులుగా నూకల విజయ్ కుమార్, నార్లపురం రవీందర్, మంచిరాల నాగభూషణంలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి హాజరయ్యారు. వక్తగా సహకార భారతి తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ సెల్ ప్రముక్ ఆవుల బాబు చంద్ హాజరై ప్రసంగించారు.