28-09-2025 07:14:33 PM
సుంకరి జనార్ధన్..
నాగారం: ప్రతి ఒక్కరు దైవ భక్తిని, ఆధ్యాత్మికతను, దైవచింతనను మానసిక ప్రశాంతతను కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్ అని అన్నారు. శనివారం నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోట, మాచిరెడ్డి పల్లెలో దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిల లింగమల్లు పుష్ప, బుర్రరవి సురాంబా, శీను ధనమ్మ దంపతులు దుర్గమాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకొని దైవచింతనని పెంపొందించుకోవాలని అన్నారు. దుర్గా దేవి ఆశీస్సులతో మండల ప్రజలు అందరు సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యలమకంటి సోమయ్య ఎన్ చిత్తలూరీ యాదగిరి, ఎల్లయ్య, వెంకన్న, నాతి శ్రీనివాస్, మాధ స్వామి, మల్లేష్, భద్రయ్య, అంజయ్య, శ్రీను, యాకన్న,శోభన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.