03-06-2025 01:33:34 AM
-33మందిపై క్రమశిక్షణ చర్యలు
-మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన అధికారులపై విజిలెన్స్ కమిషన్ కొరడా
-కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీపైనా క్రిమినల్ చర్యలకు ఆదేశం
-బ్లాక్ 7 మరమ్మతుల బాధ్యత ఎల్‌అండ్‌టీదే..
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ హాజరు అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఈ ప్రాజె క్టు అక్రమాలపై కీలకమైన ఆదేశాలు వెలువడ్డాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఎట్టకేలకు బాధ్యులైన అధికా రులపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యా యి. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి ఈ ఏడాది మార్చి 5న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ.. ప్రభుత్వం తో పాటు విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక అందించింది.
దీనిపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం విజిలెన్స్ కమిషన్ బాధ్యులైన వారిపై కఠినచర్యలకు సిఫా ర్సు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈమేరకు మేడిగడ్డ అక్రమాలకు కారణమైన వారిపై చర్యలకు ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో పేర్కొన్న కీలక అంశాల ఆధారంగా చర్యలకు సిఫార్సు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మేడిగడ్డ బరాజ్ కూలిపోవడం తో ఈ ప్రాజెక్టు పనుల్లో భాగస్వామ్యం వహించిన 17 మంది అధికారులు, పనులు చేపట్టిన ఏజెన్సీ ఎల్‌అండ్‌టీ -పీఈఎస్ (జేవీ)పై 120(బీ), 336, 409, 418, 423, 426, పీసీ యాక్ట్ 1988, డామ్ సేఫ్టీ యాక్ట్ 2021, పీడీపీపీ యాక్ట్ 1984 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది.
పనుల్లో నిర్లక్ష్యం వహించిన 33మంది అధికారులపై టీసీఎస్ (సీసీఅండ్‌ఏ) రూల్స్ 1991 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కమిషనర్ ఆఫ్ ఎంక్వురైస్‌కు అప్పగించాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. అలాగే 7గురు రిటైర్డ్ అధికారులపై తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మేడిగడ్డ పనులు చేపట్టిన ఏజెన్సీ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్ (జేవీ) పై చర్యలు తీసుకోవాలని, బ్లాక్ నెం. 7 రీప్లేస్‌మెంట్ ఖర్చు వారి నుంచే వసూలు చే యాలని సిఫారసు చేసింది. కాంట్రాక్టర్ ఒ ప్పంద షరతులను కచ్చితంగా పాటించాల ని, కాంట్రాక్టు సంస్థ అడుగుతున్న అదన పు క్లెయిమ్‌లను నిరాకరించాలని సూచించింది.
ఇంజినీరింగ్ వ్యవస్థ ప్రక్షాళనకు సిఫారసులు..
కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు మరింత శిక్షణ అవసర మని విజిలెన్స్ కమిషన్ స్పష్టం చేసింది. కొత్త టెక్నాలజీ, మెథడాలజీని అమలుచేయడానికి ముందు సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఒప్పంద పరిస్థితులు, డిజైన్‌లను పరిశీలించడానికి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో)కు ఒప్పంద కాపీ అం దించాలని తెలిపింది.
క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రతీ నిర్మాణదశలో నాణ్యతను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలను నివారించడానికి, వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా సదరు అధికా రులు, ఇంజినీర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది.
క్రిమినల్ చర్యలకు ప్రతిపాదించిన జాబితా
1. చీటి మురళీధర్, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(జనరల్)(రిటైర్డ్)
2. భూపతి రాజు నాగేంద్రరావు, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(ఆపరేషన్స్, మెయింటనెన్స్)
3. తోడుపునూరి శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్ ఆదిలాబాద్
4. వీ ఫణిభూషణ్‌శర్మ, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్
5. మొహమ్మద్ అజ్మల్ ఖాన్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్
6. ఎన్. వెంకటేశ్వర్లు, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(రిటైర్డ్), కాళేశ్వరం ప్రాజెక్ట్
7. గజ్జెల హరిహరచారి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (రిటైర్డ్)
8. బీ వెంకటరమణారెడ్డి, చీఫ్ ఇంజినీర్, మహబూబ్‌నగర్
9. సర్దార్ ఓంకార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇరిగేషన్ డివిజన్ నెం.
10. తిరుపతిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇరిగేషన్ డివిజన్ నెం.
11. బీ వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, ఇన్‌స్పెక్షన్ (రిటైర్డ్)
12. వీ అజయకుమార్, చీఫ్ ఇంజినీర్(రిటైర్డ్), ఇరిగేషన్, సంగారెడ్డి
13. పీఏ వెంకటకృష్ణ, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్
14. ఎం.రఘురామ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, ఇన్‌స్పెక్షన్
15. ఏ నరేందర్‌రెడ్డి, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(రిటైర్డ్), సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్
16. కేఎస్‌ఎస్ చంద్రశేఖర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్
17. హెచ్ బస్వరాజ్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఇరిగేషన్ సర్కిల్, సిద్దిపేట
క్రమశిక్షణ చర్యలకు ప్రతిపాదించిన అధికారుల జాబితా
1. బీ నాగేందర్‌రావు, ఈఎన్సీ (ఓఅండ్‌ఎం)
2. టీ శ్రీనివాస్, సీఈ ఆదిలాబాద్
3. వీ ఫణిభూషణ్‌శర్మ, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్
4. మొహమ్మద్ అజ్మల్ ఖాన్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్
5. కొట్టె సుధాకర్‌రెడ్డి, సీఈ జగిత్యాల
6. సుదాగోని సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్
7. బీ వెంకటరమణారెడ్డి, చీఫ్ ఇంజినీర్, మహబూబ్‌నగర్
8. సర్దార్ ఓంకార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
9. తిరుపతిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
10. బనోతు నందా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
11. అజ్మీర సురేశ్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
12. ఎల్.భీమరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
13. వలి షేక్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
14. బొగె శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
15. అంకిలియా రవికాంత్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
16. ఆర్.విజయ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
17. జీ గంగాధర్, అసిస్టెంట్ ఇంజినీర్
18. జీ సాయిచరణ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
19. ఎం.ప్రసాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
20. మేరుగు రాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
21. బీ గణేశ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
22. మొహమ్మద్ ఇస్మాయిల్ సాజిద్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్
23. పీఏ వెంకటకృష్ణ, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్
24. కే దేవేందర్‌రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్
25. ఎం.రఘురామ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
26. కిరణ్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
27. ఏ కృష్ణమోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
28. జీ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
29. ఈ సుకుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
30. పీ శ్రవణ్‌కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
31. కేఎస్‌ఎస్ చంద్రశేఖర్, సూపరింటెండింగ్ ఇంజినీర్
32. హెచ్ బస్వరాజ్, సూపరింటెండింగ్ ఇంజినీర్
33. తౌటం హేమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
చర్యలకు ప్రతిపాదించిన రిటైర్డ్ అధికారులు వీరే..
1. చీటి మురళీధర్, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(జనరల్)(రిటైర్డ్)
2. ఎన్.వెంకటేశ్వర్లు, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(రిటైర్డ్)
3. గజ్జెల హరిహరచారి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్(రిటైర్డ్)
4. బీ వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజినీర్(రిటైర్డ్)
5. చట్ల గంగాధర్, సూపరింటెండింగ్ ఇంజినీర్(రిటైర్డ్)
6. వీ అజయకుమార్, చీఫ్ ఇంజినీర్(రిటైర్డ్)
7. ఏ నరేందర్‌రెడ్డి, ఇంజినీర్ -ఇన్ -చీఫ్(రిటైర్డ్)