calender_icon.png 9 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైలెన్సర్లు మార్చితే క్రిమినల్ కేసులు

09-05-2025 01:40:49 AM

-130 మాడిఫైడ్ టూవీలర్స్ సైలెన్సర్లు ధ్వంసం 

-రోడ్డు ప్రమాదాల నివారణకు  సహకరించండి 

-జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల, మే 8 (విజయక్రాంతి): శబ్ద కాలుష్యంతో పాటూ రోడ్డుపై వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మాడిఫై చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.

ద్విచక్ర వాహనాల కంపెనీలు సదరు వాహనాలతో ఇచ్చే సైలెన్సర్లను మార్చితే సహించేది లేదన్నారు. శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న వివిధ రకాల ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటికి చెందిన 130 మాడిఫైడ్ సైలెన్సెర్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డు రోలరుతో తొక్కించి ధ్వంసం చేశారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.

మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సదరు వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.

ఇలాంటి చర్యల వలన శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల బాధ కూడా తగ్గుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు.

ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్పె క్టర్ వేణుగోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్త్స్ర మల్లేష్ పాల్గొన్నారు.