01-09-2025 12:39:50 AM
-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్‌చైర్మన్ రఘునందన్‌రెడ్డి హెచ్చరిక
నిర్మల్, ఆగస్టు 31(విజయక్రాంతి): మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూ కబ్జాలు చేశారంటూ.. పలువురు యువకులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. ఆదివా రం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడా రు. 40 సంవత్సరాలుగా ఐకే రెడ్డి నిర్మల్‌ను అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
నిర్మల్‌ను జిల్లాగా మార్చి, రోడ్లు,గుళ్ళు , బడులు కట్టించిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ఇలాంటి నాయకుడుపై కొంతమం ది యువకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా.. హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు.
ప్రస్తుతం ప్రజలు కష్టాలను తెలియజేసే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. పదవిలో ఉన్న లేకున్నా ఇంద్రకరణ్ రెడ్డి ఏడుపదుల వయసులో కూడా నిర్మల్ ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నారని పేర్కొన్నారు. గత ఐదు రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, వాగులను, చెరు వులను , కూలిన ఇండ్లను పరిశీలించి, ప్రజలకు రైతులకు మనోధైర్యాన్ని కల్పించార న్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
ఇలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష నాయకులు, కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ఐకే రెడ్డిపై చేస్తు న్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరా రు. ఐకే రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరు కునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బన్సపల్లి మాజీ పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, పాకాల ఫౌండేషన్ చైర్మన్ రాంచందర్, సీనియర్ నాయకులు మూడుసు సత్యనారా యణ, నాలం శ్రీనివాస్, రాందాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్ పాల్గొన్నారు.