calender_icon.png 31 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్ లీడర్ మాగంటి గోపీనాథ్

31-08-2025 12:48:46 AM

  1. విద్యార్థి దశ నుంచే చురుకైన వ్యక్తి
  2. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు
  3. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఆయన కూడా ఒక్కరు
  4. సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
  5. గోపీనాథ్ మరణం పట్ల తొలిరోజు అసెంబ్లీలో సంతాప తీర్మానం
  6. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న శ్రీధర్‌బాబు, తుమ్మల, పొన్నం
  7. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామన్న కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
  8. గంటపాటు కొనసాగిన అసెంబ్లీ..
  9. గోపీనాథ్ అకాల మరణంపై రెండు నిమిషాల మౌనం
  10. నేడు 9 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నట్టు ప్రకటించిన స్పీకర్

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): చూడటానికి క్లాస్‌గా కనిపించే మా గంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాస్ లీడర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గోపీనాథ్ తనకు మంచి మిత్రుడని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజు శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తె లుపుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మర ణంపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గోపీనాథ్ సేవలను స్మరించుకుంటూ మం త్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం, సీపీఐ పార్టీలు సంతాపం ప్రకటించాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గో పీనాథ్ తనకు చిన్ననాటి నుంచే మిత్రుడని, ఆయన మృతి తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసిందని, గోపీనాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జీవన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని తెలిపారు.

ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారన్నారు. టీడీపీ తో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రా రంభించారని, 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోతెలుగు యు వత అధ్యక్షుడిగా సేవలందించారని తెలిపా రు. 1987- హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా విశేష కృషి చేశారన్నారు. ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడే కాక సినీరంగంలోనూ నిర్మాతగా రాణించారని గుర్తు చేశారు.

సినిమా రంగం పై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (200 4), ‘నా స్టులే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారని స్మరించుకున్నారు. వరసగా మూ డు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో గోపీనాథ్ ఒకరని తెలియ జేశారు. గోపీనాథ్ అకాల మరణం వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

 గోపీనాథ్ డైనమిక్ లీడర్: కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సంపాదించుకున్న నాయకుడు మాగం టి గోపీనాథ్ అని కొనియాడారు. హైదరాబాద్‌లో కటౌట్ కల్చర్ తీసుకొచ్చిందే ఆయ న అని గుర్తుచేశారు. అనేక కష్ట, నష్టాలకోర్చి కూడా కేసీఆర్ వెంటే నడిచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలువడం అంత సులువు కాదని తెలిపారు. బతికినంత కాలం మాస్, డైనమిక్ లీడర్‌గా, కేసీఆర్‌కు నమ్మిన విధేయుడిగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు.

గోపీనాథ్ మరణం బీఆర్‌ఎస్ పార్టీకి, వారి కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేద ప్రజ లు సొంత మనిషగా ప్రేమించే గొప్ప నాయకుడు గోపినాథ్ అని, ఆయనను కోల్పో వడం ఎంతో బాధాకరమన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గోపీనాథ్ వివాద రహితుడని, ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగా పనిచేశారని చెప్పారు. రా ష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానం ద మాట్లాడుతూ.. గోపీనాథ్ మంచి క్రమశిక్షణ కలిగిన, ఆదర్శవంతమైన నాయకుడు అని గుర్తు చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శమన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెం కటేశ్, ముఠా గోపాల్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేశా మని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గం కోసం నిరంతరం పరితపించి, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి  అని కొనియాడారు. 

బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గోపీనాథ్ సభలో లేక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గుం డెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి  అని కొనియాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మనిషి జీవితంలో మరణం సహజమే అయినప్పటికీ   గోపీనాథ్ అకాల మరణం మాత్రం బా ధాకరమన్నారు. ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తి ఆయన అని గుర్తు చేసుకు న్నారు. ఏ పార్టీలో అయినా ఇచ్చిన అవకాశాన్ని నిలుపుకునే సామర్థ్యం ఉండాలని, గోపీనాథ్ ఆ కోవకు చెందిన వ్యక్తి అని కొనియాడారు.

గోపీనాథ్ మృదుస్వభావి 

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గోపీనాథ్ గొప్ప మానవతా వాది, మృధు స్వభావి అని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని కృషిచేశారని గుర్తు చేశారు. వారు లేని లోటు తీర్చలేనిదన్నారు. నిజమైన ప్రజా నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. హైదరాబాద్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన మాగంటి గోపీనాథ్ మరణం బాధాకరమన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిది అని పేర్కొన్నారు. గోపీనాథ్ అనుకున్న విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్టీలు వేరైనప్పటికీ గోపీనాథ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

తొలిరోజు గంటపాటు..

శనివారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ ఉదయం 10.35 గంటలకు మొదలై 11.35 గంటలకు ముగిసింది. గంటపాటు కొనసాగిన సమావేశంలో మాగంటి గోపీనాథ్ మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని, ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, కూనంనేని సాంబశివరావు, వెంకటరమణారెడ్డి, బలాల మాట్లాడారు. చివరగా గోపీనాథ్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అసెంబ్లీ తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.