22-05-2025 06:37:50 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్(Nalla Jai Shanker Goud) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హనుమాన్ భక్తి, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త మండలి అధ్యక్షులు, సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.