22-05-2025 06:43:23 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని మోదెలకు చెందిన ఎలగతి శ్రీలత(29) అనే వివాహిత గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిందని ఎస్సై సురేష్(SI Suresh) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలికి భర్త సురేష్, కూతురు ఆద్యశ్రీ(6), కొడుకు మహన్స్(3) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఆద్యశ్రీకి చిన్నతనం నుండి అనారోగ్యంగా ఉండటం ఆసుపత్రుల్లో తిరిగి మందులు వాడిన నయం కాకపోవడంతో ఇల్లు మార్చాలని వేరే కాపురం పెడదామని భర్తను కోరేది. అది కుదరకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 19వ తారీకున ఇంట్లో గడ్డి మందు తాగిందన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. మృతురాలి తండ్రి సందేల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.