calender_icon.png 22 May, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

22-05-2025 06:17:40 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బుధవారం కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి పంట ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)తో కలిసి ఖానాపూర్ మార్కెట్ యార్డులో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు ఆందోళన చెందవద్దని అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను తప్పకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.

ధాన్యం తూకం వేగం పెంచాలని, అధిక తూకం, తూకంలో మోసం, అధిక ధరలతో రైతులను మోసం చేస్తే, సహించేది లేదని, ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కావాలి సంతోష్, తోట సత్యం, మడిగల గంగాధర్, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, సివిల్ సప్లై డిఎం సుధాకర్, తాసిల్దార్ సుజాత రెడ్డి, పలువురు ఉన్నారు.