calender_icon.png 22 May, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం

22-05-2025 06:27:40 PM

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయి బాబా..

తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా(BJP District General Secretary Mallepaka Sai Baba) అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలలో చాలావరకు ధాన్యం అలాగే ఉందని ధాన్యం కోసి రాశులు పోసి నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కాంటాలు కాక అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో వారాబంది విధానంతో చాలా వరకు పంటలు ఎండి రైతులు నష్టపోతే ఇప్పుడు చేతికొచ్చిన పంట కూడా వర్షానికి నష్టపోతున్నారని అన్నారు.

కొనుగోలు కేంద్రాల నుండి త్వరగా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అన్నారు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా  కొనుగోలు చేయాలన్నారు . ఐకెపి, సొసైటీ కొనుగోలు కేంద్రాలలో ఇష్ట రాజ్యాంగ ప్రవర్తిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ దాస్ నాగరాజు గాజుల మహేందర్ ఉప్పుల లింగయ్య ఎల్లబోయిన బిక్షం కత్తుల నరేష్ పూసపల్లి శ్రీనివాస్ బొంకూరు నవీన్ పోడేటి సాయి కృష్ణ పులి పంపుల సైదులు తదితరులు పాల్గొన్నారు.