12-01-2026 05:25:32 PM
ఉప్పల్,విజయక్రాంతి): సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. నాచారం హెచ్ఎంటి నగర్ డివిజన్లోని బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సాంప్రదాయానికి ప్రతికలే అని పేర్కొన్నారు. అనంతరం ముగ్గుల పోటీ లో విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పోతగాని విజయలక్ష్మి గంధ మల్ల గోపి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు