12-01-2026 08:47:12 PM
రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం రంగవల్లులు అని రంగులతో వేసే ముగ్గులు మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తాయని రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ అన్నారు. మండలంలోని రాయినిగూడెం గ్రామంలో బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలుగు రాష్ట్రంలో పాశ్చాత్య సంస్కృతితో పండగల ప్రాధాన్యత తగ్గిపోతుందని నేటి యువత సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్దురి సందీప్, గుండు అశోక్, కర్ణాకర్, వీరబాబు, పంచాయతీ సెక్రెటరీ సునీత,గుండు నరసింహ రాజు, కోల సంధ్య, నాగమణి, సతీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు