calender_icon.png 12 January, 2026 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద కళాశాలలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

12-01-2026 08:43:59 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సోమవారం రోజున స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినడం జరిగింది. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ సి హెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పిందని తెలియజేస్తూ యువత దేశ భవిష్యత్తు అని వివేకానందుని ఉపన్యాసాలను సూక్తులను పాటించాలని సూచించారు.

స్వామి వివేకానంద తక్కువ కాలం జీవించినప్పటికీ మన దేశ నిర్మాణానికి భవిష్యత్తుకు తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివేకానంద పుస్తకాన్ని బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఏసిఓ బి. సంపత్ కుమార్,  ఏవో బి శ్రావణ్ కుమార్, బి. రామేశ్వరరావు, వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఆర్. గోపి కృష్ణ,  డాక్టర్ ఎంఎ. సలీం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్,  బి. మహేష్,  ఎన్. శ్రీనివాస్, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.